Telugu Computer World in Telugu | తెలుగులో తెలుగు కంప్యూటర్ వరల్డ్

అందరికి నమస్కారం !
ఈ రోజు నుండి మీ తెలుగు కంప్యూటర్ వరల్డ్ పూర్తిగా తెలుగులోనే రాయబదుతుంది. అయితే అందరికి అర్థమవటం కోసం అక్కడక్కడ మాత్రం ఆంగ్ల పదాలను ఉపయోగించబోతున్నాము.
ఉదాహరణ  :  పాఠకులు పదానికి బదులుగా రీడర్స్
ఇలా కేవలం చిన్న చిన్న పదాలు మాత్రం మార్పు చేయడం ద్వారా, వాడుక భాష లో సరళంగా ఈ బ్లాగ్ ని రూపొందించబోతున్నాము.



తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఇక్కడ ఏం నేర్పించబోతోంది ?

ఇక్కడ మీ తెలుగు కంప్యూటర్ వరల్డ్ మీకు ప్రొఫెషనల్ బ్లాగింగ్ అంటే ఏమిటి ?  ప్రొఫెషనల్ బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ? అంటే ఒక బ్లాగ్ లేదా వెబ్ సైట్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ? అలాగే యూట్యూబ్  ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ? మరియు ఆన్ లైన్  లో  ద్వారా డబ్బు సంపాదించడానికి గల మార్గాలు ఏవి ? అనే విషయాల గురించి మాట్లాడుతుంది మరియు నేర్పిస్తుంది.

నేను చాలా రోజులుగా ప్రొఫెషనల్ బ్లాగింగ్ మరియు యూట్యూబ్ గురుంచి తెలుగు లో చెప్పాలని, ఒక బ్లాగ్ నడపాలని అనుకుంటున్నాను. మీకందరికీ తెలుసు యూట్యూబ్ చానెల్ ద్వారా తెలుగు లో వీడియో ట్యుటోరియల్స్ చేస్తూ ఎంతో విలువైన కంప్యూటర్ పాఠాలను అందిస్తున్నాను. ఈ క్రమం లో చాలా మంది నన్ను ఎక్కువగా అడుగుతున్న విషయమే "ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ?". వారికి అడిగిన ప్రతిసారి త్వరలో చేస్తానని చెప్తూవచ్చాను. 

అలా ఆ రోజు ఇచ్చిన మాట కోసం, ఈ రోజు ఇలా నా అనుభవాలను (Online Money Earning లో) మీతో పంచుకుంటూ మీరు కూడా Online Money Earning లో విజయం సాధించేందుకు తోడ్పడాలని నిర్ణయించుకున్నాను. 

కాబట్టి మీ అందరి సహకారం కోరుతున్నాము. మీ సలహాలు, సూచనలు మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తు మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.

First

5 comments


EmoticonEmoticon