ఇంటర్నెట్ అనే కొత్త ప్రపంచం నాకు పరిచయం అయ్యింది. ఈ-మెయిల్ అంటే యాహూ!మెయిల్ మాత్రమే ఉపయోగించే రోజులవి. Gmail పరిచయం జరిగినా పెద్దగా ప్రాచుర్యం లోకి రాలేదప్పటికి. Yahoo! Messenger ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న సమయమది. అప్పుడు సోషల్ మీడియా అంటే Yahoo! Messenger లో " Public Chat rooms. " ఈ అవకాశాన్ని నేను ఇంటర్నెట్ గురించి, Online Earnings గురించి తెలుసుకోవడానికి ఉపయోగించుకున్నాను.
Yahoo! Messenger Public Chat rooms లో Online Earnings గురించి ప్రశ్నలెన్నో అడిగేవాడిని రకరకాల దేశాల వారు రకరకాల జవాబులు చెప్పేవారు. అలా నాకు పరిచయమైన ఓ గొప్ప వ్యక్తి పేరు గౌరీ శంకర్. ఆయన ఒక తమిళ భాషస్తుడు. అనతి కాలం లోనే మంచి మితృడయ్యారు. అలా ఆయన తో నాకు జరిగిన మోసాన్ని వివరించాను. అది ఓపికగా విన్న ఆయన "ఫ్రెండ్ జరిగినదేదో జరిగిపోయింది, జరిగిన సంఘటనలో మీరే సమాధానం చెప్పారు" అన్నారు. నేను "నాకు అర్థం కాలేదు" అన్నాను. అప్పుడు అతను నాకు ఆ మాటలు గుర్తుచేసారు.
" Website లో ఆడ్స్ క్లిక్ చేస్తే Website ఓనర్ కి డబ్బు వస్తుంది. "
సో, మీరే Website ఓనర్ అయితే, మీకే డబ్బు వస్తుంది కదా ? అన్నారు. ఏంటి సర్ జోక్ చేస్తున్నారా అన్నాను నేను. అప్పుడు అతను నాతో " చూడండి ఫ్రెండ్, తెలిసోతెలియకో మీరు నిజం చెప్పారు
Website లో ఆడ్స్ క్లిక్ చేస్తే Website ఓనర్ కి డబ్బు వస్తుంది అనేది 100% నిజం. ఎందుకంటే నేను అలాగే సంపాదిస్తున్నాను అన్నారు. కాని Website కావాలంటే ఆ సమయం లో చాలా పెద్ద విషయం, గొప్ప విషయం కూడా. అదే విషయం అడిగితే ఆయనే Hosting అండ్ Domain రిజిస్టర్ చేసి ఇచ్చారు. అలాగే Web Designing కోసం HTML నేర్చుకోమని సలహా ఇచ్చి నేర్చుకోవడానికి కావలిసిన e-Book పంపించారు. అదే నా జీవితం లో నేను చుసిన మొదటి e-Book.
అలా నేను ఒక స్టాటిక్ అండ్ సింపుల్ Website కి ఓనర్ అయిపోయాను. కానీ అసలు సమస్య అప్పుడే మొదలైంది. ఆడ్స్ ఎలా ? అదే ప్రశ్న గౌరీ శంకర్ ని అడిగాను. అప్పుడు అతను నాకు పరిచయం చేసిన విధానం " Google Adsense ". అది నేర్చుకొని డబ్బు పొందడానికి కొంత సమయం పట్టింది కానీ, నిజంగా నేను డబ్బు చూసిన మొదటి Online Earning గూగుల్ ఆడ్సెన్స్ ద్వారానే.
ఆ విధంగా మొదలయిన Online ప్రయాణం లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కేవలం D.T.P. మరియు వీడియో ఎడిటింగ్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్న నేను, స్వయం ఉపాది పొందుతూ ఇంటర్నెట్ సహాయం తో ఎన్నో Software లను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను.
ఈ రోజు నేను ఎన్నో Websites, Blogs నడపగలుగుతున్నాను అంటే,
Web Designing,
Web Development, 2D 3D Animation,
System Trouble Shoot లాంటివన్నీ చేయగలుగుతున్నాను అంటే కారణం ఇంటర్నెట్.
కావున, ఫ్రెండ్స్ మీరు సోషల్ మీడియా లో టైం పాస్ చేయడం ద్వారా సమయం వృధా చేయకుండా, ఏదైనా నేర్చుకోవడానికి ఇంటర్నెట్ ని ఉపయోగిస్తే జీవితం లో త్వరగా విజయం సాధిస్తారు. ఈ విషయం లో మీకు ఏదైనా సలహా, సూచన కావాలంటే నన్నడగండి, నేను మీకు సహాయం చేస్తాను.
" నన్ను నమ్మండి, ఇంటర్నెట్ లో మీరు ఏది కావాలన్న నేర్చుకోవచ్చు. "
మీ అనుభవాలు నాతో పంచుకోవలనుకుంటే కామెంట్ చేయండి.